'కూలీ' రివ్యూ

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
విడుదల తేది: ఆగస్టు 14, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
విశాఖపట్నం పోర్ట్‌లో దాగి ఉన్న క్రైమ్ నెట్‌వర్క్ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా ఇది. దేవా (రజనీకాంత్) తన టీమ్‌తో అజ్ఞాతంలో జీవిస్తూ ఉంటాడు. అతని ప్రాణస్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) అనుకోకుండా మరణిస్తాడు. అయితే, ఆ మరణం సహజ కారణాలతో కాకుండా హత్య అని దేవాకు తెలుస్తుంది.
సైమన్ (నాగార్జున) విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజ్‌పై తీసుకొని బంగారంతో పాటు లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కుడిభుజం దయాల్ (సౌబిన్ షాహిర్) దయ అనే మాటే తెలియని వ్యక్తి. అతని అరాచకానికి పోర్ట్ ప్రాంతం తల్లడిల్లిపోతుంది.
రాజశేఖర్ మరణం వెనుక నిజం తెలుసుకునే క్రమంలో దేవా, సైమన్ యొక్క స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
రజనీకాంత్ టైటిల్ రోల్‌లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ‘ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ వంటి స్టార్‌లను కలిపి మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మూవీ ఇది.
సినిమా స్టోరీ విశ్లేషణ విషయానికొస్తే అసాధారణ రీతిలో మరణించిన స్నేహితుడి మరణ రహస్యాన్ని చేధించేందుకు మాజీ కూలీ యూనియన్ నాయకుడు ప్రారంభించిన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంత ఫ్లాట్‌గా అనిపించినప్పటికీ, ప్రీ-ఇంటర్వెల్ నుంచి కథ ఆసక్తికరంగా మారి, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కౌట్ అయింది.
సెకండ్ హాఫ్‌లో కథ నెమ్మదిగా క్లియర్ అవుతూ, క్లైమాక్స్‌లో మంచి పీక్స్‌కి చేరింది. ముఖ్యంగా అమీర్ ఖాన్, ఉపేంద్ర ఎంట్రీలు మరియు ఎలివేషన్స్ ఆకట్టుకున్నాయి. రజనీకాంత్‌కు మాత్రమే కాకుండా ఇతర స్టార్‌లకు కూడా సమానంగా హైలైట్స్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్. మొత్తంగా ఇది స్నేహితుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునే రివెంజ్ డ్రామాగా నిలిచిపోయింది.
అయితే లోకేష్ కనగరాజ్ భారీ సెటప్, స్టార్ క్యాస్టింగ్‌తో ‘కూలీ’ని తెరకెక్కించినా, కథనంలో తన మార్క్‌ను అందించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో సౌబిన్, నాగార్జున వంటి పాత్రల పవర్‌ఫుల్ ఎంట్రీలు, రజినీతో కూడిన సన్నివేశాలు ఆకట్టుకున్నా, పాత్రల మధ్య కనెక్షన్ బలహీనంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌లో నాగార్జున-రజనీ సీన్ హై ఇస్తుంది.
సెకండాఫ్‌లో ‘విక్రమ్, బాషా’ టెంప్లెట్ మాదిరిగానే సన్నివేశాలు నడవడం కొత్తదనం తగ్గించింది. ఉపేంద్ర పాత్రను సరిగా వినియోగించకపోవడం మైనస్ పాయింట్. అయితే రజనీ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ మాత్రం థియేటర్లో బాగా పేలింది. క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ ఎంట్రీ ‘విక్రమ్’లో సూర్య లాగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మోనికా సాంగ్ విజువల్‌గా బాగుంది. మొత్తం మీద కొన్ని హై పాయింట్లు ఉన్నప్పటికీ, ‘కూలీ’ ఫ్యాన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటుల విషయానికొస్తే రజనీకాంత్ స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఫ్యాన్స్‌కి ఫుల్ సాటిస్‌ఫాక్షన్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో తలైవా స్క్రీన్‌పై మెరిసినప్పుడు థియేటర్లు హోరెత్తాయి. నాగార్జున ఫస్ట్‌టైమ్ విలన్‌గా బాగానే చేశాడు కానీ పాత్రకు బలం తగ్గింది. సౌబిన్ దయాళ్ పాత్రలో వెర్రితనం, కామెడీ, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆమిర్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. శ్రుతి హాసన్ పాత్ర బాగుంది.
టెక్నికల్ గా అనిరుధ్ మ్యూజిక్ ఎనర్జీ ఇచ్చింది. కొన్ని సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. మొత్తానికి లోకేష్ కనగరాజ్ స్టైల్, గ్రిప్ కొంత మిస్ అయినా, రజనీ ఫ్యాన్స్‌కి ‘కూలీ‘ ఓకే అనిపించే సినిమా.
చివరగా
‘కూలీ‘.. స్టార్ పవర్ ఫుల్, ఎమోషన్ మిక్స్‌డ్!
Telugu70MM Rating: 2.75 / 5
-
Home
-
Menu