అగత్యా మూవీ రివ్యూ

అగత్యా మూవీ రివ్యూ
X

నటీ నటులు: జీవ, రాశి కన్నా, అర్జున్ సర్జా,యోగి బాబు తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: దీపిక్ కుమార్

ఎడిటర్: సాన్ లోకేష్

నిర్మాతలు: ఇషారి కే. గణేష్ , అనీష్ అర్జున్ దేవ్

దర్శకత్వం: పా. విజయ్

రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు హీరో జీవా. ఆ తరువాత యాత్ర 2 సినిమా ద్వారా పొలిటికల్ స్టోరీ ను మన ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు మరొకసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి "అగత్యా" అనే సినిమాతో సిద్ధం అయ్యారు.ఇషారి కే. గణేష్ , అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా వేల్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. పా విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా విశేషాలు ఏంటో అసలు ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా స్థిరపడాలి అనే ఆలోచనతో అగత్య (జీవా) 30 లక్షలు పెట్టుబడి పెట్టి సినిమా పైన మక్కువతో ఆ పనులను వేగంగా చేస్తూ ఉంటాడు. అయితే మరుసటి రోజు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సినిమా ఆపేయాలని చెప్తాడు. దాంతో అగత్య ఒక్కసారిగా షాక్ కి గురై బాధపడుతూ ఉంటాడు.ఈ సమయంలో రాసి కన్నా ఇచ్చిన ఒక ఆలోచన ప్రకారం ఎలాగూ 30 లక్షలు పెట్టుబడి పెట్టాం కాబట్టి షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్న భవనాన్ని హంటింగ్ హౌస్ గా మారుస్తారు. అలా మార్చిన తరువాత నిజంగానే ఆ బంగ్లా లో వున్న ఆత్మలు భయపెడుతూ వుంటాయి. అలా అసలు బంగ్లా లో ఏం జరిగింది? బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న హీరో తల్లి కోసం ఏం చేస్తాడు?ఆత్మలు ఎవరివి? చివరికి ఏం జరిగింది? ఇవ్వన్నీ కూడా సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:

కథపరంగా చూసుకున్నట్లయితే రెగ్యులర్ హర్రర్ స్టోరీ లాగానే ఉంది. కాకపోతే ఈ కథలో సిద్ధ వైద్యం గొప్పతనాన్ని చెబుతూ, దాన్ని ప్రపంచానికి తెలియకుండా చేయడానికి అప్పట్లో కొన్ని దేశస్థులు ఎన్ని వ్యూహాలు రచించారు అనే విషయంపై చూపించారు. అదేవిధంగా ఆ సిద్ధ వైద్యం ఉపయోగించి ఒక తల్లి కోసం కొడుకు ఏం చేస్తాడు అని విషయాన్ని సిద్ధ వైద్యంతో కనెక్ట్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం హర్షించదగినదని చెప్పాలి. ఫస్టాఫ్ విషయానికి వస్తే స్టోరీ లోకి తీసుకెళ్లిన విధానం అలానే ఆత్మలు వచ్చి భయపెట్టే విధానం, ఆత్మల వల్ల కలిగిన ఇబ్బందులు అలానే కొన్ని హాస్యాస్పద సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ లో గోస్ట్ లు రివీల్ అవ్వడమే కాకుండా ఎన్నో విషయాలను ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తూ అద్భుతంగా చూపించారు దర్శకులు. అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ మాత్రం యానిమేషన్స్ ఆధారంగా తీసుకొని డిజైన్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు ఒక మెట్టు ఎక్కారని భావించవచ్చు. అయితే హర్రర్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టే విషయంలో సక్సెస్ అయినప్పటికీ ఇంకా కొంతమేరకు స్క్రీన్ ప్లే లో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది.యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అని చెప్పాలి. కానీ డబ్బింగ్ విషయంలో మాత్రం ఎందుకు ఆ జాగ్రత్తగా వ్యవహరించారు అనేది అర్థం కాలేదు.

సారాంశం:

హారర్ అండ్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది.


తెలుగు70MM రేటింగ్ - 2.5/5

Tags

Next Story