ఆగస్టు 1 వరకు రిమాండ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను నాలుగో నిందితుడిగా (A-4) పేర్కొన్నారు. త్వరలోనే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించనున్నారు.
వాదనల సందర్భంగా, తనకు వై ప్లస్ (Y+) స్థాయి భద్రత ఉన్నదని, ఆరోగ్య సమస్యలున్నాయని కోర్టుకు నివేదించిన మిథున్ రెడ్డి, భద్రతా కారణాల దృష్ట్యా నెల్లూరు జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. తనకు బ్లడ్ క్లాట్స్ సంబంధిత సమస్యలు ఉండటంతో అవసరమైన సమయంలో ఆసుపత్రిలో చికిత్స సదుపాయం కల్పించాలని కోరారు.
అయితే, మిథున్ తరపు లాయర్ 409 సెక్షన్ వర్తించదని వాదించగా, ఎస్‌ఐటీ తరుపు న్యాయవాదులు మాత్రం హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందని, ఆయన అరెస్ట్ అవసరాన్ని తెలిపే 29 కీలక కారణాలను కోర్టుకు సమర్పించారు. చివరికి, ఎస్‌ఐటీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మిథున్ రెడ్డిని రిమాండ్‌కు ఆదేశించారు.
-
Home
-
Menu