వీఐపీలకి ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల దర్శనం

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ఒక ముఖ్యమైన సూచన చేశారు.
వీరి అభిప్రాయం ప్రకారం, వీఐపీలు (ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు) తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏడాదిలో ఒకసారి మాత్రమే రావాలి. అంతేకాకుండా, వారు కుటుంబ సభ్యులతో కలిసి రావడాన్ని మాత్రమే అనుమతించాలి అని అన్నారు కోరారు.
ఇలా చేస్తే సామాన్య భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు తగ్గుతాయి అని, ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు అని, వీఐపీ దర్శనాల వల్ల సాధారణ భక్తులకు సమయం ఎక్కువ పట్టడం, ధర్మదర్శనాల వేళల్లో ఆలస్యం అవడం జరుగుతూ ఉండటం లో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అని అయన భావాన్ని వ్యక్తపరిచారు.
వెంకయ్య నాయుడు గారు చెప్పినట్లుగా, దేవస్థానం వ్యవస్థ సజావుగా నడవాలంటే ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలి. దర్శనంలో సమానత్వం ఉండాలన్నది ఆయన అభిప్రాయం.
ఈ సలహా ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వీఐపీ ప్రయోజనాల కన్నా సాధారణ భక్తుల సంక్షేమమే ముందుగా చూడాలని పలువురు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.
మాగి రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల దర్శనానికి విచ్చేసిన సందర్భంగా టీటీడీ సిబ్బంది ఆయననకి సాధార స్వాగతం పలికారు,దర్శన అనంతరం టీటీడీ చైర్మన్ బి ర్ నాయుడు గారితో కలిసి తిరుమల పవిత్ర ప్రసాదం వెంగమాంబ లో సామాన్య ప్రజలతో కూర్చుని భోజనం చేసి,నిర్వహిస్తున్న అన్న ప్రసాద కార్యక్రమాన్ని అభినందించారు.
-
Home
-
Menu