అక్రమ మైనింగ్ కేసులో వంశీకి బెయిల్ 137 రోజుల తరువాత జైలు నుంచి విడుదల

X
విడుదల సమాచారం తెలిసి జైలుగేట్ల వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ అధినేత వల్లభనేని వంశీ కి ఈ రోజు బెయిల్ లభించింది.దాదాపు 137 రోజులు జైలు జీవితం గడిపిన తరువాత ఆయనకు బెయిల్ లభించింది.196 కోట్ల రూపాయల మేర అక్రమంగా మైనింగ్ లో సంపాదించారు అని అయన పై అభియోగాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అయన బెయిల్ తిరస్కరించగా ,వంశీ తరపు లాయరు సుప్రీంకోర్టు లో బెయిల్ దాఖలు చేసారు.వాదోప వాదనలు తరువాత సుప్రీంకోర్టు ఆయనకు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.ఈ రోజు వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల అయ్యారు.అయన విడుదలను విషయాన్ని తెలుసుకుని అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Next Story
-
Home
-
Menu