వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు

వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు
X
137 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, జగన్‌కు కృతజ్ఞతలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన సతీమణి ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు.

137 రోజులపాటు జైల్లో ఉండిన వంశీ, నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వంశీ దంపతులు వైఎస్‌ జగన్‌ను కలిసి, కష్టకాలంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై చూపిన మానవతా దృక్పథానికి మరియు నైతిక మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story