వడోదర ట్రాజడీ: మోదీ, అమిత్ షా ప్రతిష్టకు చెడు మచ్చ?

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్. దేశవ్యాప్తంగా గుజరాత్ అభివృద్ధికి నిదర్శనమని చెబుతారు. కానీ ఇటీవలి ఘటనలు ఆ అభివృద్ధిపై ప్రశ్నలు వేసేలా చేస్తున్నాయి. వడోదర జిల్లాలోని గంభీర్ నదిపై వంతెన కూలిపోయిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదం.
ఈ ప్రమాదం వల్ల రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ పరువు దెబ్బతింది. అదే సమయంలో మోదీ, అమిత్ షా ప్రతిష్ట కూడా ప్రశ్నించబడుతోంది. ఎందుకంటే దేశంలోని ఎన్నో అద్భుతమైన వంతెనలను, రహదారులను నిర్మించాలన్న దార్శనికత ఉన్న మోదీ సొంత రాష్ట్రంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు బలితీసింది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వంతెన కొత్తది కాదు,1986లో నిర్మించబడిన ఈ వంతెన ఇప్పటికే పాత పడిపోయింది. దాన్ని కూల్చివేసి కొత్త వంతెన నిర్మించాలని 2022లోనే జిల్లా పంచాయత్ సభ్యుడు హర్షద్ సింగ్ సిన్హా పర్మార్ అధికారులను పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వంతెనను మూసివేయాలని లేఖలు రాశారు. కానీ అప్పటి జిల్లా కలెక్టర్, పౌర నిర్మాణ శాఖ అధికారులు స్పందించలేదు. ఫలితంగా మొన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది.
ఆ సమయంలో వంతెనపై ఉన్న ట్రక్కులు, ఇతర వాహనాలు నదిలో పడ్డాయి. స్పష్టంగా ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన మానవ తప్పిదం.
ఈ నేపథ్యంలో ప్రజలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు,దేశంలోని అత్యాధునిక వంతెనలు, రైల్వే మార్గాలు నిర్మించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి… తన సొంత రాష్ట్రంలో వంతెన కూలిన ఘటనపై మౌనంగా ఉండటం సమంజసమేనా? ప్రజల ప్రాణాలకు విలువ లేదు అనుకోవచ్చా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
-
Home
-
Menu