అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనకడుగు,24 గంటల్లో సీజ్ ఫైర్ అమలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనకడుగు,24 గంటల్లో సీజ్ ఫైర్ అమలు
X
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య కుదిరిన ఒప్పందం అన్న డోనాల్డ్ ట్రంప్

గత కొద్ది రోజులుగా ఇరాన్ -ఇజ్రాయిల్ మధ్య జర్గుతున్న యుద్ధం,ఇజ్రాయిల్ కు అమెరికా సహాయం చేయటం మూడవ ప్రపంచయుద్ధం వస్తుందా అన్నట్టు జరిగింది.అమెరికన్ సైన్యం భారీ బంకర్ బ్లాస్టర్ తో ఇరాన్ అనుసంస్థలపైనా విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది.ఆ దాడులను అమెరికా అధ్యక్షుడు సమర్ధించుకోవటం కూడా ఇరాన్ సైనక అద్యక్షునకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.అమెరికన్ స్థావరాలపై తాము దాడులు చేస్తామని జాతీయ మీడియా ద్వారా ప్రకటించింది ఇరాన్ .

ముందుగా ఇరాన్ తమ చమురు కర్మాగారాలని మూసివేస్తునట్టు ప్రకటించింది,ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు ఉల్లిక్కి పడ్డాయి.ముఖ్యంగా భారతదేశం లో దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండేలా కనిపించింది.

ఇరాన్ తను ప్రకటించినట్టు అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.ఖతర్ ,ఇరాక్ అమెరికా ఎయిర్ బేస్ల పైన క్షిపణుల వర్షం కురిపించింది.ఒకవైపు అమెరికా యుద్ధ విమాన సంస్తలపైనా దాడులు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ యుద్ధం ముగిసింది అని ప్రకటించటం విశేషం.ఇరుదేశాలతోను చర్చలు జరిపాను అని

12 రోజుల యుద్ధం ఇక ముగిసినట్టే అని ఇరు దేశాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.మరో 24 గంటలు లోపల దశల వారీగా సీజ్ ఫైర్ అమలు అవుతుంది అని స్వయంగా ట్రంప్ ప్రకటించటం విశేషంగా మారింది.

ఎక్కడ యుద్ధం జరిగిన అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిగా వ్యవరిస్తునట్టు ప్రకటించుకోవడం పరిపాటిగా మారింది.మొన్న భారత్ - పాక్ ల మధ్య యుద్ధం కూడా తన మధ్యవర్తిత్వం వల్లే ముగిసింది అని ప్రకటించుకొన్నారు ట్రంప్.కానీ భారత్ దీన్ని ఖండించింది.

ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిర్చాను అంటున్న డోనాల్డ్ ట్రంప్ ముందుగా ఇరాన్ వైపుగా కాల్పుల విరమణ మొదలు పెడుతుంది అని ప్రకటించారు.ఇరాన్ దీనికి వ్యతిరేక సంకేతాలు ఇచ్చింది,మాతో ఎటువంటి చర్చలు జరగలేదు అని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు.అయినా ముందుగా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఆపాలి అన్నారు.చర్చలు జరగాలి అంటే ఇరు సైనిక అధ్యక్షులు మాట్లాడుకుని ఒప్పంద పత్రాలు రాసుకోవాలి అన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి.

అప్పటి వరకు అమెరికా స్థావరాలపైనా ఇజ్రాయిల్ పైన దాడులు ఆపే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పిందిఇరాన్ ప్రభుత్వం.ట్రంప్ చెప్పింది నిజామా కాదా అని మరో 24 గంటల్లో తెలిసిపోతుంది.ఏది ఏమైనా యుద్ధం ఆగాలి అనే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.

Tags

Next Story