అమెరికాతో ఉక్రెయిన్ $100 బిలియన్ వెపన్ డీల్!

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ అమెరికాతో భారీ వెపన్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు 100 బిలియన్ డాలర్లు అని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యూరప్ నుంచి వచ్చే నిధులతో అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు కొనుగోలు చేయాలని ఉక్రెయిన్ భావిస్తోంది.
ఇక ఈ ఒప్పందానికి బదులుగా రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరినట్లు చెప్పబడుతోంది. దీంతో "ట్రంప్ కోరుకున్నది ఇదే" అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్–జెలెన్స్కీ భేటీ సమయంలో ఓ సరదా సంఘటన కూడా చోటుచేసుకుంది. సమావేశంలో పాల్గొన్న ఒక రిపోర్టర్, జెలెన్స్కీ వేసుకున్న బ్లాక్ జాకెట్ సూట్ చాలా స్టైలిష్‌గా ఉంది అని ప్రశంసించారు.
అప్పుడు ట్రంప్ కూడా జోక్యం చేసుకుని, "అదే నేను కూడా చెప్పాను" అంటూ చమత్కరించారు. దీంతో అక్కడి వాతావరణం కాసేపు నవ్వులతో కళకళలాడింది.
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే రిపోర్టర్ గతంలో జెలెన్స్కీ సూట్ లేకుండా వైట్ హౌస్‌కి వచ్చినప్పుడు విమర్శలు చేసినట్లు గుర్తుచేశారు.
-
Home
-
Menu