శ్రీశక్తిపీఠ అభివృద్ధికి టిటిడి పూర్తి సహకారం చైర్మన్ బి.ఆర్. నాయుడు

X
టిటిడి నిర్ణయాలను అభినందించిన పీఠాధిపతులకు ఛైర్మన్ కృతజ్ఞతలు
శ్రీశక్తిపీఠంలో జరుగుతున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించేలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయని టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. ఈ పీఠ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పీఠాభివృద్ధిపై టిటిడి పాలకమండలిలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. టిటిడి తీసుకున్న నిర్ణయాలను అభినందించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి భక్తులకు నిరంతరం సేవ చేస్తూనే ఉంటానని నాయుడు హామీ ఇచ్చారు.
దళితవాడల్లో ఇప్పటికే 500 దేవాలయాల నిర్మాణం కొనసాగుతోందని, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం తమ లక్ష్యమని చెప్పారు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు.
Next Story
-
Home
-
Menu