వైఎస్‌ఆర్ 76వ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద వైఎస్ జగన్ ఘన నివాళి

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పాంజలులు సమర్పించి నివాళి ఘటించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, ఇతర సన్నిహితులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఘాట్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. నాయకులితో పాటు పెద్ద ఎత్తున అభిమానులు కూడా హాజరై మహానేత జ్ఞాపకాలతో మునిగిపోయారు.
వైఎస్ జగన్ వచ్చారని తెలుసుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఘాట్ వద్దకు చేరుకున్నారు. నాయకుడిని కరచాలనం చేయాలన్న ఆతురతతో, సెల్ఫీలు దిగాలన్న ఉత్సాహంతో అభిమానులు పోటెత్తారు.
ఈ సందర్భంగా కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వినిపించారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతులు లేకుండా యూనివర్సిటీని నడుపుతున్న విషయంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్‌కు తగిన న్యాయం జరగాల్సిందే. మంచి యూనివర్సిటీ స్థాపించినా, ఈ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోంది. విద్యార్థులకు అన్ని విధాల అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది, అని హామీ ఇచ్చారు.విద్యార్థులతో పాటు పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
-
Home
-
Menu