శ్రీవారికి అతి పెద్ద బంగారపు కానుక

తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారం కానుకగా ఇవ్వబోతున్నారు. దీని విలువ దాదాపు ₹140 కోట్లు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు.ఆ భక్తుడు విదేశాల్లో వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో సంపాదించాడు. తన కంపెనీ వాటాలను అమ్మి వేల కోట్లు సంపాదించాడని సమాచారం. ఈ విజయం శ్రీవారి కృప వల్లే సాధించానని భావించి, కృతజ్ఞతగా ఈ విరాళం ఇవ్వాలని నిర్ణయించాడు.
ప్రతిరోజూ శ్రీవారి అలంకరణకు సుమారుగా 120 కిలోల బంగారం ఉపయోగిస్తారు. అందుకే భక్తుడు ఇచ్చే ఈ 121 కిలోల బంగారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు.తన పేరు బయటకు రావాలనుకోకపోవడంతో, ఈ కానుకను అజ్ఞాతంగా సమర్పించనున్నాడు. టిటిడి కూడా భక్తుని కోరికను గౌరవిస్తున్నది.
ఇప్పటికే టిటిడి ఖజానాలో 10 వేల కిలోలకుపైగా బంగారం ఉంది. శ్రీవారి వద్ద సుమారు 1,100 స్వర్ణాభరణాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త విరాళం చేరడంతో టిటిడి వద్ద బంగారం మరింత పెరుగుతుంది.గతంలో శ్రీకృష్ణదేవరాయలు, మైసూరు మహారాజులు కూడా శ్రీవారికి భారీగా బంగారం, రత్నాలు కానుకగా ఇచ్చారు. వాటి తరువాత ఇప్పటి ఈ 121 కిలోల బంగారపు విరాళమే అతి పెద్దదిగా గుర్తించబడుతోంది.
-
Home
-
Menu