సింధు జలాలపై భారత్–పాక్ మధ్య మళ్లీ ఉద్రిక్తత

సింధు జలాలపై భారత్–పాక్ మధ్య మళ్లీ ఉద్రిక్తత
X
పాక్ సైన్యాధిపతి, మాజీ మంత్రి నుండి ఘర్షణాత్మక వ్యాఖ్యలు - నీటి కొరతతో పాకిస్థాన్ లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సులపై తీవ్ర ప్రభావం

భారత్‌పై పాక్ దళాలు దాడి చేసిన సందర్భంలో, పాకిస్థాన్‌కు సింధు జలాలు ఇవ్వకుండా భారత్ తన ప్రతిష్టను కాపాడుకునే నిర్ణయం తీసుకుంది. దీనిపై పాక్ మాజీ సైన్యాధిపతి ఆసిం మునీర్, మాజీ మంత్రి బిలావాల్ భుట్టో కఠిన వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలని పాక్ కోరుతూ, దేశ విదేశాలలో శాంతి ఒప్పందాలు మొదలు పెట్టింది. పాకిస్థాన్ తరఫున సింధు జలాలను తిరిగి ఇవ్వాలని ఘాటుగా డిమాండ్‌ చేస్తూ, ఈ ఒప్పందాన్ని న్యాయపరంగా కొనసాగించాలని కోరుతూ ఢిల్లీకి లేఖ పంపింది.

మాజీ సైన్యాధిపతి ఆసిం మునీర్, భారత్ డ్యాం కడితే క్షిపణులతో దాడి చేస్తామని హెచ్చరించారు. భారత్ ఏ డ్యాం నిర్మించినా, దాన్ని పది క్షిపణులతో ధ్వంసం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. పాక్ మాజీ మంత్రి బిలావాల్ భుట్టో కూడా భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని కోరారు. ఒక్కపక్క పాక్ నోరుపారేసుకుంటూనే సింధు జలాల ఒప్పందం విషయమై భారత్‌తో, పాక్‌ దేశం శాంతి ఆహ్వానాలు జరపటం గమనార్హం.

భారత్–పాక్ మధ్య నీటి సమస్య చాలా కాలంగా ఉంది. 1960లో రెండు దేశాలు ఇండస్ వాటర్ ట్రిటీ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్, జెలమ్, చెనాబ్ నదుల నీటిని పాక్ వాడుకోవాలి. రవి, బియాస్, సుట్లెజ్ నదుల నీటిని భారత్ వాడుకోవాలి. డ్యాం లేదా ప్రాజెక్టులు కట్టాలంటే ముందుగా సమాచారం ఇచ్చుకోవాలి.

ఈ ఒప్పందం గత ఆరు దశాబ్దాలుగా యుద్ధాలు, ఉద్రిక్తతల మధ్య కూడా కొనసాగింది. కానీ 2025 ఏప్రిల్‌లో పాక్ ఆధారిత ఉగ్రవాదులు భారత్‌పై దాడికి ప్రతిస్పందనగా భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీని వల్ల పాక్‌లో, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ మరియు సింధ్ ప్రావిన్స్ ప్రాంతాలలో నీటి కొరత ఎక్కువైంది.

నీటి కొరతతో పాక్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్, భారత్‌పై ఘర్షణాత్మక వ్యాఖ్యలు చేశారు. బిలావాల్ భుట్టో, ఒప్పందంలోని ఆరు నదులను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.ఒకవైపు పాక్ నాయకులు కఠిన వ్యాఖ్యలు చేస్తుండగా, మరోవైపు పాక్ ప్రభుత్వం మాత్రం భారత్‌ను సంప్రదించి, ఒప్పందాన్ని మళ్లీ అమలు చేయాలని కోరింది. నీటి సమస్య పాక్‌లో వ్యవసాయం, తాగునీటి సరఫరా రెండింటిపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ఈ పరిస్థితి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఘర్షణకు దారితీయవచ్చు. అలాగే డ్యాంలు, నీటి మళ్లింపు వంటి చర్యలు నదుల పర్యావరణాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే నీటి సమస్యను పరస్పర సహకారంతో, రాజకీయ రగడల నుండి దూరంగా పరిష్కరించడం అవసరం.

Tags

Next Story