కేంద్రం మధ్యవర్తిత్వానికి తెలంగాణ 'నో'.. ఏపీకి ఎదురుదెబ్బ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈసారి కేంద్రంగా బనకచర్ల ప్రాజెక్ట్ కు మధ్యవర్తిత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చలకు ఆహ్వానించింది. రాయలసీమకు నీటిని మళ్లించే లక్ష్యంతో బనకచర్ల సాగునీటి ప్రాజెక్టును అభివృద్ధి చేసే క్రమంలో, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య మళ్లీ మంటలు చెలరేగాయి.
ఏపీ ప్రభుత్వం, బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇదే ఏకైక అజెండా కావాలని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు తమకు ప్రాణప్రదం లాంటిదని, ప్రాజెక్టు పనుల్లో ఆటంకాలు లేకుండా తేల్చాలి అని పట్టుదలగా ఉంది.
అయితే, ఈ భేటీకి తెలంగాణ ప్రభుత్వం అసహాయత వ్యక్తం చేసింది. “బనకచర్లపై చర్చ అవసరం లేదు” అనే స్పష్టమైన లేఖను కేంద్రానికి పంపింది. చర్చలు వల్ల విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయంతోనే చర్చను విస్మరించాల్సి వచ్చిందని తెలంగాణ సర్కార్ స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విశేష చర్చ జరుగుతోంది. రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి—చంద్రబాబు భేటీపై జోరుగా చర్చ సాగుతోంది. భేటీ జరుగుతుందా? జరగకపోతే దాని రాజకీయ సంకేతాలేంటి? అనే దానిపై తెలంగాణ లో అనేక ఊహాగానాలు నెలకొన్నాయి.
ఈ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలకంగా రంగప్రవేశం చేసింది. రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను సమతుల్యంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో సమావేశ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. చర్చలు ఎక్కడి దాకా వెళ్లతాయో అనేది జరిగితేనే కానీ తేలదు. అయితే ఇప్పుడు సమావేశానికి తెలంగాణ రాష్ట్రం అంగీకరించ పోయేసరికి ఇపుడపుడే బసకచర్ల ప్రాజెక్ట్ సాధ్యం కాదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
బనకచర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం సాంకేతిక సమస్య కాదని, రాష్ట్రాల మధ్య నమ్మక సమస్యగా మారుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌కు సాగునీటి అవసరం అత్యవసరం కాగా, మరోపక్క తెలంగాణ ప్రాజెక్టు చర్చను తిరస్కరించడం ఆలోచనలో పడేస్తోంది.
ఈ క్రమంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో, రాష్ట్రాల మధ్య చర్చకు మార్గం ఎప్పుడు అమలు అవుతుందో అనే అంశం మరింత ఆసక్తికరంగా మారింది.
-
Home
-
Menu