ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ప్రకటన

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. T20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగుతుండగా, వైస్ కెప్టెన్ బాధ్యతలు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరిపై పెద్ద బాధ్యత ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.T20 ఫార్మాట్లో జరగబోవు ఈ మ్యాచ్ లు సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యూఏఈ వేదికగా జరగబోతున్నాయి.
జట్టులో జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం పెద్ద బలం అని భావిస్తున్నారు. ఆయనతో పాటు అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో అనుభవం ఉన్నవాళ్లతో పాటు కొత్త ప్రతిభకు కూడా అవకాశం కల్పించారు.
అయితే కొన్ని పేర్లు లిస్ట్‌లో లేకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీరు స్టాండ్‌బై జాబితాలో ఉన్నప్పటికీ ప్రధాన జట్టులో లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
15 మంది ప్రధాన జట్టులో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజు సామ్‌సన్, జితేష్ శర్మ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం డుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ఋంకు సింగ్ ఉన్నారు.
స్టాండ్‌బై జాబితాలో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ పేర్లు ఉన్నాయి. అంటే అవసరం వచ్చినప్పుడు వీరికి అవకాశం లభించే అవకాశం ఉంటుంది.
మొత్తం మీద ఈ సారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేశారు. అనుభవం ఉన్న సీనియర్లు తక్కువగా ఉన్నా, యువ ఆటగాళ్ల ప్రతిభపై ఎంపికదారులు నమ్మకం ఉంచారు. ఈ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu