ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీల నియామకంపై పెద్ద వివాదం చెలరేగింది. 2023 సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్ మరియు కూర్ర సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీగా నియమించమని అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే, గవర్నర్ తామిలిసాయ్ సౌందరరాజన్ ఈ ఇద్దరి పేర్లను తిరస్కరించారు. ఈ నిర్ణయం తప్పు అని భావించిన శ్రావణ్, సత్యనారాయణ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు మొదట తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. 2024 మేలో హైకోర్టు, గవర్నర్ తిరస్కరణ నిర్ణయాన్ని రద్దు చేసింది. కానీ వెంటనే నియామకం చేయాలని స్పష్టమైన ఆదేశం ఇవ్వలేదు. అంటే, గవర్నర్ కొత్త పేర్లను పరిశీలించే అవకాశం మిగిలిపోయింది.ఈ సమయంలో, 2024 జనవరి 13న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ ఎం. కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది.దీనికి గవర్నర్ అనుమతినిచ్చి, 2024 జనవరి 27న అధికారిక ప్రకటన వెలువరించారు.
బీఆర్‌ఎస్ నేతలు ఈ కొత్త నియామకాలను కూడా సవాల్ చేశారు.2024 మార్చిలో హైకోర్టు, గవర్నర్ ఆమోదం, ప్రభుత్వ సిఫార్సు, అధికారిక ప్రకటనలను చెల్లుబాటు కానివిగా ప్రకటించింది. దీనితో కోదండరాం, అమీర్ అలీ నియామకాలు చెల్లవని తీర్పు వెలువడింది.కోదండరాం, అమీర్ అలీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. 2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై తాత్కాలిక నిలుపుదల విధించింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ నియామకాలు కొనసాగుతాయని తెలిపింది.సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా, 2024 ఆగస్టు 17న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరి పదవులు తుది తీర్పుపై ఆధారపడి ఉన్నాయి.
2025 ఆగస్టు 13న, సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీ నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త నామినేషన్లు తుది తీర్పుకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ఈ కేసును 2025 సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. ఆ తేదీ తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
-
Home
-
Menu