రెడ్డి పల్లెలో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

రెడ్డి పల్లెలో  రోడ్డు ప్రమాదం:  ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
X
ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి - మెరుగైన వైద్యం అందించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దిగ్భ్రాంతికరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మామిడి కోత పనులకు వెళ్లిన కూలీలు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారని తెలిపారు పవన్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

రాజంపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద బాధితులను సోమవారం మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న రాత్రి చోటు చేసుకున్న లారీ బోల్తా ఘటన తాను ఎంతో దిగ్భ్రాంతితో విన్నట్లు చెప్పారు.

రోజూవారీ కూలీ పనులు చేసుకునే వారు, విధిలేని పరిస్థితుల్లో ఆ లారీపై ప్రయాణించడం ఎంతో దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందినట్టు తెలిపారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురు రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురిని కడప రిమ్స్‌కు, మరొకరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించాం అని మంత్రి వివరించారు.

మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన బంధువులే కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తి చూపిన మంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఈ దుర్ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడాం అన్నారు జనార్ధన రెడ్డి,ఆయన సూచనల మేరకు బాధితులను పరామర్శించాం అని, ఈ కుటుంబాలను ఎలా ఆదుకోవచ్చనే విషయంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, ప్రభుత్వం వీలైనంతవరకు వారికి సహాయాన్ని అందిస్తుంది అని మంత్రి తెలిపారు.

ప్రమాదానికి కారణాలపై ప్రాథమిక సమాచారం వెల్లడించిన మంత్రి, వర్షం పడుతుండగా, ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడం వల్ల లారీ జారీ ప్రమాదం జరిగింది, అన్నారు. రోడ్డు భద్రత పరంగా సూచికలు, సైన్‌బోర్డులు ఏర్పాటు అవసరమైతే, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియచేసారు మంత్రి.

భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story