ఓట్ల గోల్ మాల్ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.

ఓట్ల గోల్ మాల్ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.
X
ఎన్నికల సంఘంపై నమ్మకాన్ని దెబ్బతీసే పకడ్బందీ ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ ప్రకటన.

రాహుల్ గాంధీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి జరిగిన ప్రతి పార్లమెంట్ మరియు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల సంఘం (ఈసీ) బీజేపీకి అనుకూలంగా పని చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఈసీ తటస్థంగా ఉండాల్సినప్పుడు, బీజేపీ ప్రయోజనాల కోసం ఓట్లను చోరీ చేయడంలో సహకరించడం అర్థం కాకుండా ఉందని చెప్పారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తమ దగ్గర ఈ కుట్రకు సంబంధించి "ఆటమ్ బాంబ్" లాంటి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరలో ప్రజల్లోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ ఆధారాలు ఎన్నికల సంఘం వ్యవస్థ మీద పూర్తి నమ్మకం కోల్పోయేవిధంగా ఉన్నాయి అని, దేశ ప్రజలతో ఇదో పెద్ద మోసం జరిగినట్టు ప్రూవ్ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే వ్యక్తికి ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే చిరునామాతో ఓటింగ్ హక్కు కల్పించబడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి డూప్లికేట్ ఓట్లు వేలల్లో ఉన్నాయని చెప్పారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రమే 1 లక్షకు పైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు రాహుల్ వివరించారు,11,965 డూప్లికేట్ ఓట్లతో 40,009 తప్పుడు చిరునామాలతో ఓట్లు ఉన్నాయి అని,ఒకే చిరునామాలో 80 మందికి ఓటింగ్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు,4,132 తప్పుడు లేదా స్పష్టంగా కనిపించని ఫోటోలు ఉన్న ఓట్లు అనేవి ఉన్నాయని వెల్లడించారు.

ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన అంచనాలు వాస్తవ ఫలితాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దీని వల్ల ఈవీఎంలలో, ఓటింగ్ విధానంలో అసలు జరుగుతున్నదేమిటనేదానిపై అనుమానాలు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒకే ఎన్నికల వ్యవధిలో దాదాపు 1 కోటి కొత్త ఓట్లు నమోదు కావడం అనుమానాస్పదమని రాహుల్ గాంధీ తెలిపారు.

ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘంలో ఉన్న అధికారులు బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గతంలో పని చేసిన అధికారులు అయినా, ప్రస్తుత అధికారులు అయినా, ఈ కుట్రలో పాల్గొంటే దేశద్రోహం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన వారు, ప్రజల విశ్వాసాన్ని మోసం చేస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణించాలి అన్నారు.

రాహుల్ చేసిన ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారంగా, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవని ఈసీ పేర్కొంది. రాహుల్ గాంధీ తమ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడాన్ని కూడా ఈసీ విమర్శించింది. అలా చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం తగదని ఈసీ స్పష్టం చేసింది.

Tags

Next Story