అమరావతిలో క్వాంటం వ్యాలీ – భవిష్యత్తు టెక్నాలజీకి నూతన ద్వారం

అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉందంటే, భారత్‌లో – ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో – అమరావతిలో క్వాంటం వ్యాలీను ఏర్పాటు చేయాలన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ధృఢ సంకల్పం. 2026 జనవరి 1 నాటికి ఈ విశిష్టమైన టెక్నాలజీ పార్క్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ నిర్మాణం జరగనుంది అని సీఎం తెలియచేసారు.
దేశాన్ని క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా,వ్యవసాయం, ఆరోగ్య, భద్రత, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ వినియోగాన్ని విస్తరించడం జరుగుతుంది అన్నారు.విజయవాడలో జరిగిన నేషనల్ క్వాంటం టెక్నాలజీ వర్క్ షాప్కు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,1995లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ను కలిసిన సందర్భం గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే ఐటీ విస్తరణపై దృష్టిపెట్టి, హైదరాబాద్‌లో హైటెక్ సిటీని PPP మోడల్‌లో నిర్మించాం. అదే విధంగా, ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేసారు.
వందకు పైగా యూజ్ కేసులు పరీక్షించబడ్డాయి,రియల్ టైమ్ డేటా విశ్లేషణ కోసం అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు.వ్యవసాయం, హెల్త్‌కేర్, ఫార్మా పరిశోధనలు, రక్షణ రంగం వంటి అనేక వేదికలపై ఇది ప్రభావం చూపుతుంది అని క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లు (రతన్ టాటా మోడల్) ఏర్పాటవుతున్నాయి అంన్నారు బాబు .యువత, పరిశోధకులు, సంస్థలు భాగస్వాములవ్వాలని సీఎం పిలుపునిచ్చారు.వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్" మిషన్‌కు ఇది చొరవ చూపుతుంది అని పేర్కొన్నారు.
క్వాంటం టెక్నాలజీ విజన్ అమలు కోసం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు బాధ్యత అప్పగించారు సీఎం ,కార్నెగీ మెలన్ వంటి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆయనకు ఈ రంగంపై స్పష్టత ఉందని పేర్కొన్నారు.
-
Home
-
Menu