పీవీఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:15 గంటలకు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
పదవీ బాధ్యతల స్వీకరణకు ముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పీవీఎన్ మాధవ్ నివాళులు అర్పించారు. అనంతరం కళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ,నా ముందు పార్టీ అధ్యక్షులయిన వారంతా తమ శక్తి యుక్తులతో పార్టీని ముందుకు నడిపారు. వారి ఆశయాల మార్గంలోనే నడుస్తాను. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి ప్రజల సమస్యలపై పని చేస్తాను అని మాట ఇచ్చారు మాధవ్. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలికే దిశగా బీజేపీ ఉద్యమించబోతుంది అన్నారు.
అలాగే, మాధవ్ మాట్లాడుతూ,ప్రతీ బీజేపీ కార్యకర్త తానే అధ్యక్షుడిననే భావనతో పనిచేస్తున్నారు. అదే మా బలంగా మారింది. ప్రజల కోసం, న్యాయపాలన కోసం బీజేపీ కట్టుబడి ఉంటుంది అని తెలియచేసారు బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్.
ఇంకా ఆయన తెలుగు శాసనభాషగా ఉండాలని నిఘంటువు రూపొందించిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి నివాళులర్పించినట్టు పేర్కొన్నారు.పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టడంతో బీజేపీలో ఉత్సాహం కనిపించగా, రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త దిశను సృష్టిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
Home
-
Menu