గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు నియామకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మూడు రాష్ట్రాల గవర్నల నియామకానికి నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గోవా రాష్ట్ర గవర్నర్‌గా ప్రముఖ రాజకీయ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు.అదే విధంగా హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోష్ ,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ డిప్యూటీ సీఎం జమ్మూ & కాశ్మీర్ కవిందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తరులు జారీ చేసారు.
విజయనగరం రాజ కుటుంబానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు తెలుగు రాజకీయాల్లో విశిష్ట స్థానం కలిగిన నేత. తొలిసారి తన రాజకీయ ప్రస్థానం జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు.మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు. 2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎం.పీగా ఎన్నుకోబడ్డారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫినాన్స్, లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు.
ఆయన గోవా గవర్నర్‌గా నియమితుడవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లా నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ఈరోజు గవర్నర్ పదవిని తాకడం విశేషం.
-
Home
-
Menu