మార్వాడి “గో బ్యాక్” పోరాటంలో పృథ్వీరాజ్ అదుపులో

మార్వాడి “గో బ్యాక్” పోరాటంలో పృథ్వీరాజ్ అదుపులో
X
నిన్న అర్థరాత్రి తన నివాసం నుంచి పోలీసుల అదుపులోకి తీసుకువెళ్తారు, మొదట నల్లకుంట పోలీస్ స్టేషన్‌కి, ఆ తర్వాత ఇతర స్టేషన్లకు తరలింపు

తెలంగాణలో ఆకాంక్షల కోసం పోరాటం చేస్తోన్న వ్యక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా, మార్వాడి “గో బ్యాక్” ప్రచారంలో పాల్గొన్న పృథ్వీరాజ్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిన్న అర్థరాత్రి, ఆయన తార్నాకలోని నివాసం నుండి పోలీసులు ఆయనను తీసుకువెళ్లారు. మొదట నల్లకుంట పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత, ఇతర పోలీస్ స్టేషన్లకు తరలిస్తోన్నట్లు సమాచారం వస్తోంది.

ఈ చర్యకు కారణం ఏమిటి? ఎవరు ఫిర్యాదు చేశారు? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత లభించలేదు. అయితే, పృథ్వీరాజ్ యాదవ్ పలు మీడియా చానళ్లలో చర్చల్లో పాల్గొని, గో బ్యాక్ నిరసన సమావేశాల్లో మాట్లాడిన తీరు మార్వాడీ సంఘాల కొంతమంది ప్రతినిధులకు అభ్యంతరంగా అనిపించిందని తెలిసింది.ఇప్పటికే, ఈ సంఘాల ప్రతినిధులు ఆయనతో వాదనకు దిగినట్లు మరియు పృథ్వీరాజ్ పై ఫిర్యాదు చేసినారేమో అనే అనుమానాలు ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.అదుపులో వాహనంలో ఉన్నపుడు పృథ్వీరాజ్ యాదవ్ సెల్ఫీ వీడియో వాట్సాప్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిపై విమర్శలు వ్యక్తం చేశారు.

Tags

Next Story