బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణకు హాజరు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జూలై 30, 2025న హైదరాబాద్‌లోని బషీర్బాగ్‌లో ఉన్న Enforcement Directorate (ED) కార్యాలయంలో విచారణ కోసం హాజరయ్యారు. ఈ విచారణ దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ బెట్టింగ్ యాప్‌లపై ఆర్థిక మోసాల నివారణకు సంబంధించి చేపట్టిన దర్యాప్తులో భాగంగా కొనసాగుతోంది. అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు ప్రజలపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఈడీ వీటికి సంబంధిత ప్రమోషన్లు చేసిన వారిపై దృష్టిసారించింది.
ఈ కేసులో ప్రాథమికంగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో జనవరి 19, 2025న నమోదు అయిన FIR ఆధారంగా మొత్తం 29 మంది ప్రముఖులు విచారణకు పిలవబడ్డారు. వీరిలో ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండ వంటి వారు ఉన్నారు. వారంతా గేమింగ్ లేదా బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయబడ్డ లబ్దిదారులుగా భావించబడ్డారు.
ఈ కేసు ప్రకారం తెలంగాణ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ 66-D, భారత్ న్యాయ సంబంధిత సెక్షన్లు 318(4), 112 (49) కింద కేసులు నమోదు అయ్యాయి.
ఈ విచారణలో ప్రకాశ్ రాజ్ తన వివరాలను ఈడీకి సమర్పించారు. 2016లో Junglee Rummy అనే ఆన్‌లైన్ రమ్మీ యాప్‌కు ప్రచారం చేశానని ఆయన పేర్కొన్నారు. అయితే, 2017లో దీని విషయంలో కొన్ని అనుమానాస్పద అంశాలు కనిపించడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఎలాంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌కు ప్రచారం చేయలేదని స్పష్టమైన ప్రకటనను ఇచ్చారు ప్రకాష్ రాజ్ . ఈ విచారణలో తనకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్, ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దర్యాప్తును వేగంగా చేపడుతోంది. విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన ప్రక్రియలు ముమ్మరంగా సాగే అవకాశం ఉంది.
-
Home
-
Menu