అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత

అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపి వేస్తున్నట్టు భారత పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది: 2025 ఆగస్టు 25 నుండి అమెరికాకు ఎక్కువ భాగం పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించింది. దీనికి గల కారణం అమెరికా ప్రభుత్వం కొత్త కస్టమ్స్ పన్ను విధానాన్ని తీసుకురావటమే.ఇప్పటివరకు అమెరికాకు USD 800 (సుమారు ₹67,000) వరకు విలువ ఉన్న వస్తువులు డ్యూటీ లేకుండా పంపవచ్చు. కానీ అమెరికా ఇప్పుడు ఆ మినహాయింపును తొలగించింది. ఇకపై చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు అన్నీ కస్టమ్స్ డ్యూటీకి లోబడి ఉంటాయి అని వైట్ హౌస్ ప్రకటించడంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోస్టల్ అధికారులు తెలిపారు.
భారత పోస్టల్ సేవ అన్ని పూర్తిగా నిలిపివేయలేదు. లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్‌లు (USD 100 లోపు విలువ ఉన్నవి) మాత్రం కొనసాగుతాయి. అంటే చిన్న గిఫ్ట్ ఐటమ్స్ లేదా పర్సనల్ లేఖలు పంపించవచ్చు. కానీ పార్సెల్స్, కమర్షియల్ వస్తువులు, ఆన్‌లైన్ ఆర్డర్స్ లాంటివి పంపడం ఆగిపోయింది.అమెరికా కస్టమ్స్ వారు కొత్త నియమాలు ఎలా అమలు చేస్తారో ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఎయిర్‌లైన్ కంపెనీలు కూడా స్పష్టత లేకపోవడంతో, పార్సెల్స్ రవాణా చేయలేమని తెలిపాయి. అందుకే ఇండియా పోస్టు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది అని ప్రకటించారు.
అమెరికాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు బహుమతులు, అవసరమైన వస్తువులు పంపించుకోవడం ఇప్పుడు చాలా కష్టమవుతుంది. ఇంతకాలం సాధారణంగా పోస్టల్ ద్వారా పంపించే వారు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేక ఇబ్బంది పడవలసివస్తుంది.చిన్న వ్యాపారులు, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో (e-commerce) వస్తువులు అమ్మే వారిపై ఎక్కువగా ప్రభావం పడనుంది. వారి వ్యాపారం అమెరికా కస్టమర్లపై ఆధారపడి ఉంటే, ఆర్డర్లు పంపించలేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇప్పటికే కొంతమంది తమ పార్సెల్స్ బుక్ చేసుకున్నారు. కానీ అవి డిస్పాచ్ కాలేకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. పోస్టల్ శాఖ మాత్రం ఈ పరిస్థితిని గుర్తించి, అలాంటి బుకింగ్స్‌కు పోస్టేజ్ రీఫండ్ పొందే అవకాశం కల్పించింది.
-
Home
-
Menu