జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం కేసులో కీలక మలుపు పూర్ణచంద్రరావు అరెస్ట్

జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం కేసులో కీలక మలుపు పూర్ణచంద్రరావు  అరెస్ట్
X
చంచల్‌గూడ జైలుకు పూర్ణచంద్రరావు... పూర్ణ వాంగ్మూలం సంచలనం

పూర్ణచంద్రరావు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, పూర్ణపై భారతీయ శిక్షాసమితి (బి.ఎన్.ఎస్) లోని సెక్షన్ 69, 108తో పాటు, ఫోక్సో (POCSO) యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు.

విచారణ అనంతరం పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆదివారం నాడు జడ్జి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను రిమాండ్‌కు పంపిస్తూ, చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇక, తన వాంగ్మూలంలో పూర్ణచంద్రరావు చేసిన కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యల నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. అతని అభిప్రాయాలు, వ్యక్తీకరణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పూర్తి విచారణ అనంతరం మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసు సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

Tags

Next Story