కాంగ్రెస్ కు పొంగులేటి షాక్ తెలంగాణ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రేవంత్ రెడ్డి కాబినెట్ లో రెవెన్యూ శాఖ మంత్రిగా కీలక బాధ్యత వహిస్తున్నారు.ఇటీవల ఈయన చేస్తున్న కీలక వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ గోవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి.
మొన్నటి సభలో పొంగులేటి మాట్లాడుతూ రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై లక్షల పేదలకి ఇందిరమ్మ ఇళ్ల కట్టిస్తాం అని హామీ ఇచ్చారు.ఈ విషయంమై రేవంత్ సర్కార్ ఒక్కసారిగా షాక్ కి గురి అయింది.సీఎం రేవంత్ తో చేర్చించకుండానే సభలలో హామీలు ఇవ్వటం సరికాదు అని అధిష్టానంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఇటీవల కాలంలో కూడా సీఎం రేవంత్ హాని ,పంచాయతీరాజ్ మంత్రి ని కానీ సంప్రదించకుండానే పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలపై చేసిన ప్రకటన కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అనంతరం ,సభలో ప్రసంగించారు,బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాలనలో అనుకున్న ఒక్క లక్ష్యాన్ని చేరలేకపోయిందని ఆయన ఆరోపించారు.తమ ప్రభుత్వం అలాంటిది కాదు అని రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మించాకే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తాం అని అన్నారు.
అసలు మూడు సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టడం సాధ్యమైన అని రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది.సాద్య ఆసాధ్యాలు ఆలోచించ కుండా సభలలో ఏదిపడితే అది మాట్లాడటం పొంగులేటి మాట్లాడటం వల్ల రాన్నున్న ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యంగా మారుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.
-
Home
-
Menu