సిడ్నీ గోల్ఫ్ కోర్సులో కుప్పకూలిన విమానం

సిడ్నీ గోల్ఫ్ కోర్సులో కుప్పకూలిన విమానం
X
Piper PA-28 Cherokee లైట్ విమానం అకస్మాత్తుగా పవర్ కోల్పోయింది - ఫెయిర్‌వేపై బలంగా పడినా, ఇద్దరూ పైలెట్స్ సురక్షితంగా బయటపడ్డారు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. మోనా వేయిల్ గోల్ఫ్ కోర్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది. Piper PA-28 Cherokee అనే లైట్ విమానం ఆగస్టు 17న మధ్యాహ్నం Camden ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి Wollongong వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది.

ఇంజిన్ పవర్ కోల్పోవడంతో పైలట్ తక్షణమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించాడు. చివరకు విమానం గోల్ఫ్ కోర్సు ఫెయిర్‌వేలో బలంగా పడిపోయింది. సంఘటనలో విమానం దెబ్బతిన్నా, అదృష్టవశాత్తూ పైలట్‌తో పాటు శిక్షణలో ఉన్న మరో వ్యక్తి ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది గోల్ఫ్ ఆడుతుండగా ఒక్కసారిగా విమానం కూలిపోవడం చూసి షాక్‌కు గురయ్యారు. అదృష్టం వశాత్తూ అక్కడ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అధికారులు ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. విమానం ఎందుకు పవర్ కోల్పోయిందో, ఇంజిన్‌కు విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ATSB) లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలు ఉన్నవారు ముందుకు రావాలని కూడా కోరింది.

Tags

Next Story