విదేశాల్లో బందీలైన భారతీయుల రక్షణకు కేంద్రానికి పవన్ వినతి

విదేశాల్లో బందీలైన భారతీయుల రక్షణకు కేంద్రానికి పవన్ వినతి
X
విదేశాల్లో చిక్కుకున్న యువకులను వెంటనే రప్పించండి – పవన్ కళ్యాణ్ వినతి

విదేశాలలో బాగా సంపాదించవచ్చు అనే ఉదేశ్యం తో చాల మంది యువకులు మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న విష్యం ఈ మధ్య చాల చుస్తునాం, మీకు ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి వాళ్ళని విదేశాలకు పంపించి వాళ్ళ గురించి పట్టించుకోకుండా అక్కడ ఉన్న వ్యాపారస్తులకు అమ్మేస్తున్నారు.పాపం వెళ్లిన వారు తిరిగి రాలేక అక్కడ బానిసలుగా దుర్భర జీవితం గడుపుతున్నవారు చాలా మంది ఉన్నారు.కొంత మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పిర్యాదులు కేంద్ర ప్రబుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే వాళ్ళని స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం సాయ పడుతుంది.

ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారులు మానవ అక్రమ రవాణా ముఠాల చేత బందీలుగా మారిన పరిస్థితిని వివరించేందుకు శ్రీమతి గండబోయిన సూర్యకుమారి అనే మహిళ బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె,మయన్మార్ సరిహద్దుల్లో తమ ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు ముఠాల చెరలో మగ్గుతున్నారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ముఠాల చెరలో ఉన్న భారతీయులను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి ప్రాణాలను రక్షించి భారత్‌కు తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చింది అని తెలియచేసారు పవన్.

విదేశాల్లో ఇలాటి బాధితులను వెనక్కి రప్పించే ప్రక్రియను వేగవంతం చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేశారు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ, ఇలాంటి మానవ అక్రమ రవాణా ముఠాల పట్ల ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. బాధితులను సురక్షితంగా తీసుకురావడమే ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Tags

Next Story