పార్టీ బలోపేతానికి పవన్ కల్యాణ్ కీలక సమావేశం

పార్టీ బలోపేతానికి  పవన్ కల్యాణ్ కీలక సమావేశం
X
ఆగస్ట్ 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ సమావేశం - తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలంగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఈ నెల 30న విశాఖపట్నంలోని మున్సిపల్ స్టేడియంలో రెండు రాష్ట్రాల కీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ బలాన్ని పెంచడం, స్థానిక ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలా వ్యూహంగా పోరాడాలో మాట్లాడబోతున్నారు. తెలంగాణ నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంతో సమన్వయం, సోషల్ మీడియాలో దారి తప్పుతున్న కార్యకర్తలకు కర్తవ్య బోధ కూడా ఈ సమావేశంలో ఇవ్వబడవచ్చు. పవన్ కల్యాణ్ కీలక అంశాలను ప్రస్తావించవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సమావేశ ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. గతంలో పిఠాపురంలో ఆవిర్భావ సభను నిర్వహించిన తర్వాత మళ్లీ పార్టీకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.

పవన్ కల్యాణ్ తన సమయాన్ని తీరిక లేకుండా నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కొన్ని కీలక శాఖల బాధ్యతలు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం పూర్తి దృష్టి పెట్టే సమయం వచ్చింది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Next Story