కాకినాడలో 79వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పవన్

కాకినాడలో 79వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో పవన్
X
శాంతి, భద్రతలే అభివృద్ధి పునాది, స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - కాకినాడ జిజిహెచ్ లో రూ.6 కోట్లతో క్యాన్సర్ బ్లాక్ నిర్మాణం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతూ, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని తెలిపారు.దేశం లోపల అస్థిరత సృష్టించే శక్తులపై పహారా కాయడం అందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, దేశంలో అవినీతి వంటి సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం, దీపం-2, స్త్రీశక్తి వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.గ్రామాల్లో సీసీ రోడ్లు, నీటి కుంటలు, గోకులాల నిర్మాణం, కొత్త వంతెనలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని పవన్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా లక్షల మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించామని తెలియచేసారు.

అటవీ విస్తీర్ణం పెంచే లక్ష్యంతో కోట్లాది మొక్కలు నాటడం, ఏనుగుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు, అరకులో ఉడెన్ బ్రిడ్జి వంటి ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు.రైతులకు పిఎం-కిసాన్ సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్ల పంపిణీ, జాబ్ మేళాల ద్వారా యువతకు ఉద్యోగాలు, జల జీవన్ మిషన్ కింద తాగునీటి పనులు వంటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వివరించారు.కాకినాడ జనరల్ హాస్పిటల్‌లో రెడ్ క్రాస్ నిధులతో రూ. 6 కోట్ల వ్యయంతో కొత్త క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Tags

Next Story