పాశ మైలారం పేలుడు విషాదం: మృతుల సంఖ్య 42కి చేరింది

సంగారెడ్డి జిల్లా పాశ మైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనలో కొందరి శవాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. బూడిద గుట్టల మధ్య ఎముకల ముద్దలు మాత్రమే కనిపించడంతో తీవ్ర విషాదంలో కుటుంబాలు మునిగిపోయాయి.
ప్రాంతంలో ఇంకా శిధిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి. మరో రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశముంది. పేలుడుతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తో పాటు ప్రొడక్షన్ బిల్డింగ్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి.మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్‌కు చెందిన కార్మికులే. కుటుంబాల ఆశలు ఒక్కసారిగా బూడిద కమ్మేసిన ఈ ఘోర ప్రమాదం, ఇతర రాష్ట్రాలకూ విషాదాన్ని చేరవేసింది.
పేలుడు ఘటనలో గాయపడిన 33 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
సిగాచి కెమికల్స్ కంపెనీలో కెమిస్ట్ గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా చాగల్లు గ్రామ యువతి పోలిశెట్టి ప్రసన్న (22) మృతి చెందారు.రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరిన ప్రసన్న ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవ్వుతున్నారు.మృతురాలి తండ్రి పోలిశెట్టి శ్రీను చాగల్లులో మధర్ థెరిస్సా సేవా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంటారు.ఘటనా స్థలానికి యువతి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు చేరుకున్నారు.
మరికొద్దిసేపట్లో ప్రసన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు.Pasha Mileram blast tragedy: Death toll reaches 42
ఈ రోజు ఘటన స్థలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు బృందం పరిశీలించింది. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు
-
Home
-
Menu