హిందీ భాషపై వ్యతిరేకత సరికాదు: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

హిందీ భాషపై  వ్యతిరేకత సరికాదు: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
X
వ్యాపారానికి హిందీ కావాలి, కానీ నేర్చుకోవడానికి మాత్రం వద్దా? – పవన్ ప్రశ్న

దేశవ్యాప్తంగా హిందీ భాషపై కొనసాగుతున్న వివాదాల నడుమ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న రాజ్య భాష విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన, హిందీ భాష ప్రాధాన్యతపై ఓ స్పష్టమైన ఆవిష్కరణ చేశారు.

“హిందీ భాషపై గుడ్డిగా వ్యతిరేకత సరికాదు” అని పవన్ స్పష్టం చేశారు. వ్యాపారానికి, వాణిజ్యానికి హిందీ అవసరం.. కానీ, జీవితంలో నేర్చుకోవడానికి మాత్రం అవసరం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

భాషల పట్ల మనలో ఉండాల్సిన అభివృద్ధి దృష్టిని అర్ధం చేసుకుంటూ మాట్లాడుతూ, ఒక భాషను నేర్చుకోవడం వలన అదనపు పరిజ్ఞానం కలుగుతుంది అన్నారు పవన్. ప్రస్తుత ప్రపంచంలో ఉపాధి కోసం, విద్య కోసం ఖండాంతరాలు దాటి వెళ్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో భాషలపై మితిమీరిన వ్యతిరేకత అనవసరం అని ఉపోద్గాటించారు డిప్యూటీ సీఎం.

తెలంగాణ, కర్ణాటకలలో హిందీపై వ్యతిరేకత, మహారాష్ట్రలో త్రిభాషా ఫార్ములా అమలులో వెనుకంజ వంటి ఘటనలను నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశమంతటా హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆరోపణలు రాజకీయంగా తీవ్రమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

హిందీలో డబ్‌ అయిన దక్షిణ భారతీయ సినిమాలు 31 శాతం వరకు ఆదాయాన్ని తెస్తున్నాయని తెలియచేసిన పవన్ కల్యాణ్, అలాంటి స్థితిలో వ్యాపారానికి హిందీ అవసరమైతే, విద్యార్థులు, యువత భవిష్యత్ కోసం నేర్చుకోవడంలో తప్పేముంది? అంటూ విమర్శించారు.

తమిళనాడులో జరిగిన మురుగన్ మహానాడులో కూడా ఇదే తరహా అభిప్రాయాలు వెల్లడించిన పవన్, ఇప్పుడు హైదరాబాదులోనూ అదే వైఖరిని ప్రదర్శించటం గమనార్హం. భవిష్యత్తు తరాలకు అభివృద్ధి దారి చూపాలంటే, భాషల పట్ల ఉదారంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Tags

Next Story