మధ్యతరగతికి మోదీ డబుల్ దీపావళి కానుక

మధ్యతరగతికి మోదీ డబుల్ దీపావళి కానుక
X
దీపావళి నాటికి కొత్త జీఎస్టీ మార్గదర్శకాలు, పన్ను సవరణలు,సాధారణ కుటుంబ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం - శాశ్వత ఆర్థిక ఊరటకు రాబోయే సంస్కరణలు సహాయం

స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలు,జీతదారులు సమస్యలపై ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సంవత్సరం దేశానికి “డబుల్ దీపావళి” అని పేర్కొంటూ, జీఎస్టీ సంస్కరణలు మరియు పన్ను తగ్గింపులు అందించనున్నట్లు చెప్పారు.దీపావళి వరకు ప్రభుత్వం కొత్త జీఎస్టీ మార్గదర్శకాలు ప్రకటించి, పన్నులను తగ్గించనుంది. ఈ చర్యలతో అవసరమైన వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అన్నారు. దీని వల్ల ప్రజలు కొంత ఊరట పొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి మాట్లాడుతూ, రోజువారీ ఉపయోగించే వస్తువులు మరింత చవకగా లభించేందుకు జీఎస్టీ స్లాబ్‌లను సవరించనున్నట్లు చెప్పారు. సాధారణ కుటుంబ జీవనం సులభంగా ఉండేలా చేయడం, ఖర్చులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు.దీపావళి కానుకగా, తదుపరి జీఎస్టీ మార్పులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జీఎస్టీలో పెద్ద మార్పులు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చలు జరిపి, ప్రస్తుత నిబంధనల్లో మార్పులు చేసి, జీఎస్టీ మరియు పన్ను వ్యవస్థను సవరించే సమయం వచ్చిందన్నారు.

ప్రస్తుతం సంవత్సరానికి ₹12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించినట్లు మోదీ గుర్తు చేశారు. ప్రజల మద్దతుతో, రాబోయే ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు శాశ్వత ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.

Tags

Next Story