ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం – బీజేపీకి రాజీనామా

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు తిరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజీనామా చేసి సంచలనాత్మక ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి స్వయంగా అందజేశారు.
రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పార్టీకి అర్హత లేని వారు అధికంగా చొరబడ్డారు అని, బీజేపీ గెలిచే అవకాశాన్ని తాము అడ్డుకోవాలని భావించే వాళ్లు ఎక్కువయ్యారు అని వెల్లడించారు. పార్టీ విలువలు, హిందుత్వ పరిరక్షణ నుంచి పార్టీ దూరమవుతోంది, ఈ పరిస్థితుల్లో నాకు పార్టీలో స్థానం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్.
రాజాసింగ్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని వచ్చినట్లు తెలిపారు. అయితే, తన మద్దతుదారులను బెదిరించడం, రాజకీయంగా ఒత్తిడులు తెచ్చే విధంగా వ్యవహరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను నామినేషన్ వేయాలన్న మాట వినగానే, నా వెంట ఉన్న కార్యకర్తలను బెదిరించడం మొదలైంది. పార్టీ అంతర్గత రాజకీయాలే దీనికి కారణం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
-
Home
-
Menu