రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం - సునామి అలెర్ట్

రష్యాలోని కామ్‌చాట్‌కా ద్వీపచాపం (Kamchatka Peninsula) వద్ద సముద్రతీరంలో జూలై 29, 2025 రాత్రి 23:24 యూటీసీ స్థానిక సమయం ప్రకారం ఉదయం (జూలై 30 ఉదయం 10:24 స్థానిక సమయం) చాలా పెద్ద భూకంపం సంభవించింది.ఇది నగరానికి సుమారు 125–136 కి.మీ దూరంలో దీని తీవ్రతా ముందుగా 8.0గా నమోదైనా, తరువాత 8.7–8.8గా అప్‌డేట్ అయింది. దీని తీవ్రత 8.8 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. ఇది భూమి లోతుల్లో 19 కిలోమీటర్ల లోపల సంభవించింది. ఇది గత పది ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపాలలో ఒకటి.
ఈ భారీ భూకంపం తాలుకూ ప్రభావంతో సునామీ అలలు ఉత్తర పసిఫిక్ మహాసముద్రానికి అంచున ఉన్న దేశాలకు తాకాయి. రష్యా తీర ప్రాంతాలలో 3 నుంచి 5 మీటర్ల వరకు భారీ అలలు వచ్చాయి. అనేక ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రష్యా లోని కురిల్ ద్వీపాల భాగమైన పరాముషిర్ ద్వీపంలో ఉన్న ఒక ముఖ్య పట్టణం సెవెరో-కురిల్స్క్ అనే పట్టణం పూర్తిగా ముంపుకు గురయ్యింది. ప్రజలు ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లారు.
భూకంపం తీవ్రత దృష్ట్యా, జపాన్, హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరం, న్యూజిలాండ్, చిలీ, ఫిలిప్పీన్స్ వంటి పసిఫిక్ దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్‌లో కొన్ని ప్రాంతాలలో 1.3 మీటర్ల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. హవాయిలో కూడా అలలు తాకడం తీవ్రం అవ్వడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో తీరప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం ప్రాణ నష్టం ఎంత జరిగింది అనే దానిపై కచ్చితమైన ఆధారాలు ఏమి ప్రకటించలేదు. కానీ రష్యాలో కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఒక స్కూల్ భవనం కూలిపోయి ఎంతమంది చిక్కుకున్నారో వివరాలు తెలియలేదు. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. అనేక ప్రాంతాల్లో వార్నింగ్ సైరన్లు, ఎమర్జెన్సీ ఎలర్ట్‌లు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
8.8 తీవ్రత గల భూకంపం తర్వాత 6.9, 6.3, 5.7 తీవ్రతలతో 60కి పైగా భూకంపాలు తరువాత (aftershocks) సంభవించాయి. ఇవి కూడా ప్రజల్లో భయాన్ని మరింత పెంచాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాల్లో చిన్న పగుళ్లు వచ్చాయి. అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగిన సూచనలను ఇస్తుంది.
ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఎమర్జెన్సీ విభాగం సూచనల్ని అనుసరించాలి అని హెచ్చరికలు జారీ చేస్తుంది. సునామీ అలలు ఇంకా కొన్ని ప్రాంతాలకు తాకే అవకాశం ఉన్నటు అధికారులు తేలియాచేస్తునారు. ముఖ్యంగా పసిఫిక్ తీరం కలిగిన దేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీచేసింది. సమాచారం కోసం అధికారిక సూచనలు మాత్రమే నమ్మాలి అని రష్యా ప్రభుత్వం తెలియచేసింది.
-
Home
-
Menu