వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం కుంభకోణం – కీలక అధికారిపై SIT ఫోకస్

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది.ఇప్పటికే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు అతని కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా మద్యం కుంభకోణం లో మనీ లాండరింగ్ చేసినట్టు ఆధారాలతో బయట పెట్టిన సిట్ బృందం అతనికి అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్న మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరో కీలక అడుగు వేసింది. మాజీ ఐఏఎస్ అధికారి డా. రాజత్ భార్గవాకు నోటీసులు జారీ చేస్తూ, ఆయనను శుక్రవారం విజయవాడలోని ఎస్ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
డా. రాజత్ భార్గవా పలు కీలక పదవుల్లో పనిచేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్సైజ్, పరిశ్రమలు, ఆర్థిక శాఖలను వహించారు. ఆయనపై ఎస్ఐటీ విచారణలో కొన్ని అధికారిక ఉత్తర్వులు, పరిపాలనా అనుమతులు, అలాగే ప్రైవేట్ మద్యం సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో, గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో మోనోపాలీకి అనుకూలంగా విధానాలు రూపొందించారని, దీని వల్ల ధరలు కృత్రిమంగా పెరిగినట్లు, కొన్ని బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచినట్లు, కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులకు కమీషన్లు లభించాయని ఎస్ఐటీ అభిప్రాయపడుతోంది.
అధికారిక ఫైళ్లు, లేఖాచారల పరిశీలనలో డా. రాజత్ భార్గవా పేరు వచ్చిందని విచారణా బృంద వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి నష్టం, ప్రైవేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చిన నిర్ణయాల వెనుక ఉన్న ఆధారాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే పలు మాజీ ఎక్సైజ్ అధికారులు, సీనియర్ అధికారులను ఎస్ఐటీ విచారించిన నేపథ్యంలో, ఈ దర్యాప్తు మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
-
Home
-
Menu