పార్టీ బలోపేతాన్ని పటించుకొని జనసేనాని కార్యకర్తల నిరాశ

పార్టీ బలోపేతాన్ని పటించుకొని జనసేనాని కార్యకర్తల నిరాశ
X
సంవత్సర కాలంగా పార్టీని కార్యకర్తల్ని పట్టించుకోని పవన్

జనసేన, బీజేపీ టీడీపీ లతో కలిసి తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అందుకు తగ్గట్టుగానే మంత్రి పదవుల నుంచి పాలనా పరమైన వ్యవహారాల వరకు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కాలం పూర్తి చేసుకుంది.ఇక సీఎం గా బాబు తన మంత్రి వర్గంలో ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసి ఆయనకు తగిన ప్రాధాన్యం, గౌరవము ఇచ్చారు. అలాగే ఈ ఏడాది కాలంలో మూడు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ విభేదాలు చోటు చేసుకోలేదు.

అందులో భాగంగానే రాష్ట్ర ప్రగతికి ఈ కూటమి బంధం మరో 15 సంవత్సరాలు ఇలానే కొనసాగుతుంది అంటూ పవన్ ప్రతి సభ లోను పదేపదే నొక్కివక్కాణిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేనల బంధం అంటే రాష్ట్రంలో రెండు ప్రధాన సామజిక వర్గాలైన కమ్మ, కాపు ఏకీకరణ అవుతుంది. ఈ పొత్తు కూటమికి రాజకీయంగా మరింత శక్తిని ఇస్తుంది.

గడిచిన ఏడాది కాలంలో పవన్ తన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ నాయకత్వ పటిష్ఠతకు ఎటువంటి ప్రణాళికలు రచించారు అని చూస్తే శూన్యమనే చెప్పాలి. ఈ ఏడాది విలువైన రాజకీయ సమయాన్ని పవన్ తన పార్టీ పటిష్టత కోసం వినియోగించుకోకపోవడం పార్టీ శ్రేణులను కూడా నిరాశకు గురి చేస్తుంది.

పార్టీ బూత్ లెవెల్ కార్యర్తలను నియమించగలిగారా.? పార్టీ ముందున్న సంస్థాగత నిర్మాణ సమస్యను అధిగమనించేలా నాయకులను తయారు చెయ్యగలిగారా.? అన్నఎన్నో ప్రశ్నలకు జనసేన వద్ద సమాధానం లేదు.

పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాలలోని జనసేన బలోపేతానికి పవన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ గెలిచిన ఎమ్మెల్యే లతోను చర్చలు, సమావేశాలు నిర్వహించలేదు.జనసేన ఆవిర్భావ దినోత్సవం తప్ప పవన్ పార్టీ గురించి కార్యకర్తల గురించి ఒకసారి ఆలోచించలేదు.ఒకసారి కూడా పార్టీ కార్యకర్తలతో కానీ పార్టీ శ్రేణులతో కానీ సమావేశం నిర్వహించలేదు, అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ ఇప్పటికే రెండు పడవల మీద ప్రయాణం చెయ్యాలని చూస్తున్న పవన్, ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను మోస్తూ మూడో పడవ మీద కాలు మోపుతున్నారు.

దీనితో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కు అనుకూలమైన సమయం కూడా వెచ్చించలేకపోతున్నారు. అయితే పవన్ పార్టీ పటిష్టత పై పెట్టాల్సిన శ్రద్ధను ఇతర పార్టీల బలోపేతానికి వెచ్చిస్తూ పార్టీని గాలికొదిలేస్తున్నారు అనే భావన సొంత పార్టీ అభిమానులలోను కనిపిస్తుంది. బీజేపీ మత రాజకీయ వ్యూహంలో పవన్ చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారా అనే సందేహాలు జనసేన పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story