ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన జాజుల శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రముఖ బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నేడు హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన, తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 42 శాతం వరకు పెంచుతూ కేంద్రానికి పంపిన బిల్లుపై దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావాలని, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మరియు ఇతర కీలక స్థాయిల్లో బీసీలకు వారి జనాభా ప్రకారం హక్కులను కల్పించాలన్న అంశాన్ని వినతి పత్రంగా సమర్పించారు.
ఇతర డిమాండ్లలో భాగంగా, బీసీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పిస్తూ, బీసీ వర్గానికి చెందిన నేతలలో ఒకరిని ఉపముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు, మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఖర్గే గారిని విజ్ఞప్తి చేశారు.
-
Home
-
Menu