ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద రాజీనామా: వ్యక్తిగత నిర్ణయమే కారణమని స్పష్టం

ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద రాజీనామా: వ్యక్తిగత నిర్ణయమే కారణమని స్పష్టం
X
వ్యక్తిగత, దీర్ఘకాలిక లక్ష్యాల దృష్ట్యా రాజీనామా నిర్ణయం,ఆంధ్రప్రదేశ్‌ను సొంత ఊరిగా భావించాను – భావోద్వేగ భరిత ప్రకటన

సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, మరియు తన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ మధ్య తన రాజీనామాకు పలు నిరాధార ఆరోపణలతో అనవసర సంబంధం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, అవన్నీ పూర్తిగా అబద్ధమైనవని స్పష్టం చేశారు. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంగా , ఇందులో ఎటువంటి బలవంతం లేదని స్పష్టంగా చెప్పదలచుకున్నాను అని తెలిపారు సిద్ధర్థ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరంగా భావించిన శ్రీ కౌశల్, ఈ భూమిని తన సొంత ఊరిలా భావించాను అని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలంటే నాకు ఎంతో ప్రేమ అని , ఇక్కడి అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వానికి, తన సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, అలాగే సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపిన విశ్వాసమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని ఆయన అభినందనలతో చెప్పారు.

భవిష్యత్తు పట్ల తన దృఢ సంకల్పాన్ని వెల్లడించిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్, సమాజానికి కొత్త మార్గాల్లో సేవ చేయాలన్న తన అభిలాషను తెలియజేశారు. కృతజ్ఞత, స్పష్టత, మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగతాను అని ఆయన సిధార్థ కౌశిక్ IPS పేర్కొన్నారు.

Tags

Next Story