ఓవల్ టెస్ట్‌లో దుమ్మురేపిన భారత్ బౌలర్ల

చివరిది అయిన భారత్ ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్ ఒవెల్ లో జరుగుతుంది.ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఎలాగైనా సిరీస్ దక్కిన్చుకోవాలి అని చూస్తే భారత్ మాత్రం ఈ టెస్ట్ ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలి అని ప్రయత్నిస్తుంది.భారత్ తొలి ఇన్నింగ్స్ లో బాటింగ్ లో అంతగా రాణించలేకపోయింది.
కానీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత జట్టు బౌలింగ్‌లో దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో తడబడ్డా, మహమ్మద్ సిరాజ్ (4/86), ప్రసిధ్ కృష్ణ (4/62) ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను కేవలం 51.2 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌట్ చేసింది. జాక్ క్రాలీ (57 బంతుల్లో 14 ఫోర్లు, 64), హ్యారీ బ్రూక్ (64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్, 53) హాఫ్ సెంచరీలతో రాణించగా, బెన్ డకెట్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్, 43) దూకుడుగా ఆడాడు. గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు రాలేదు. ఆకాష్ దీప్ ఒక వికెట్ తీశాడు.
204/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, 69.4 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ నాయర్ (109 బంతుల్లో 8 ఫోర్లు, 57), వాషింగ్టన్ సుందర్ (55 బంతుల్లో 3 ఫోర్లు, 26) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ (5/33) ఐదు వికెట్లు, జోష్ టంగ్ (3/57) మూడు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ సాధించాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ ‘బాజ్‌బాల్’ శైలిలో దూకుడుగా ఆడారు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్, రివర్స్ స్కూప్ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. 92 పరుగుల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌లో దూసుకెళ్తుండగా, డకెట్‌ను ఆకాష్ దీప్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కి పంపాడు. జాక్ క్రాలీ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే 109/1 స్కోర్‌తో లంచ్‌కు వెళ్లింది.
లంచ్ తరువాత భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. సెంచరీ దిశగా సాగుతున్న జాక్ క్రాలీ (64)ని ప్రసిధ్ కృష్ణ అవుట్ చేయగా, ఓలీ పోప్‌ను (11) సిరాజ్ ఎల్బీ చేశాడు. రివ్యూలో భారత్‌కు విజయం దక్కింది. జో రూట్ (22)నూ సిరాజ్ ఎల్బీ చేయగా, వెంటనే జాకోబ్ బెతెల్ (6)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. మరోవైపు జెమీ స్మిత్ (8), జెమీ ఓవర్టన్ (9)లను వరుస ఓవర్లలో ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఈ దశలో ఇంగ్లండ్ 215/7తో టీ బ్రేక్‌కి వెళ్లింది.
టీ బ్రేక్ తర్వాత హ్యారీ బ్రూక్, గస్ అట్కిన్సన్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. బౌండరీలతో జోరు చూపిన అట్కిన్సన్‌ను (27) ప్రసిధ్ కృష్ణ అవుట్ చేశాడు. జోష్ టంగ్ (0 నాటౌట్) సాయంతో బ్రూక్ వేగంగా రాణించాడు. వర్షం ఆటకు అంతరాయం కలిగించినా, తిరిగి ప్రారంభమైన తరువాత బ్రూక్ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరికి సిరాజ్ బౌల్డ్ చేయడంతో బ్రూక్ ఇన్నింగ్స్ ముగిసింది, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 247 పరుగుల వద్ద ఆగింది.
-
Home
-
Menu