హైదరాబాద్ హెచ్‌సీఏలో భారీ ఫోర్జరీ కుంభకోణం – అధ్యక్షుడు జగన్ అరెస్ట్

హైదరాబాద్ హెచ్‌సీఏలో భారీ ఫోర్జరీ కుంభకోణం – అధ్యక్షుడు జగన్ అరెస్ట్
X
పత్రాలు నకిలీ చేసి హెచ్‌సీసీకి ఎంట్రీ – సీఐడీ విచారణలో సంచలనాలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో సంచలనంగా మారిన మరో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. గౌలిగూడలోని శ్రీచక్ర క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ క్లబ్ యాజమాన్యాన్ని తమ్ముడు–మరదలు కలిసి అక్రమంగా తమ పేరున మార్చుకున్నట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది.

ఈ ఫోర్జరీ ఆధారంగా వారు హైదరాబాద్ క్రికెట్ క్లబ్ (HCC) లోకి కూడా ప్రవేశించినట్టు సమాచారం. పత్రాలు నకిలీ చేసి, నమ్మకద్రోహంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఘటనగా ఈ కేసును విచారిస్తున్నారు.

ఈ ఘటనపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మ గురువా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తును చేపట్టారు. విచారణలో స్పష్టమైన ఆధారాల వెలుగులో, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును అరెస్ట్ చేశారు.

ఈ కేసు నకిలీ పత్రాలు, నిధుల మళ్లింపు, నమ్మకద్రోహం వంటి తీవ్ర అభియోగాలపై నడుస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌సీఏలో క్రికెట్ పరిపాలనపై నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags

Next Story