ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో వాడి వేడి చర్చ

ఈ రోజు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మరియి ఆపరేషన్ మహాదేవ్ గురించి వాడి వేడిగా చర్చలు జరిగాయి.ఈ రెండు సంఘటన్లు గురించి విపక్షాలు అధికార NDA పార్టీ మీద విమర్శనా హాస్త్రాలు సందించాయి.ప్రతిపక్షాల చేసిన ఆరోపల్ని ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు, పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చిందని స్పష్టం చేశారు. ఆ దాడిలో పర్యాటకులపై జరిగిన దుర్మార్గానికి ప్రతిగా, భారత వైమానిక దళాలు “ఆపరేషన్ సిందూర్” పేరుతో శత్రువు మీద 2025 మే 9న విరుచుకుపడ్డాయని తెలిపారు. ఆ రోజు పాకిస్తాన్ నుండి భారత వైమానిక పరిధిలోకి ప్రవేశించిన సుమారు వెయ్యి మిస్సైళ్లను, డ్రోన్లను విజయవంతంగా తుడిచిపెట్టామని మోదీ చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో అత్యంత నైపుణ్యంతో వాయుసేన, రక్షణ వ్యవస్థలు పని చేశాయని మోదీ అభిప్రాయపడ్డారు. కేవలం 22 నిమిషాల్లో ప్రజలను రక్షణ గల ప్రాంతాలకు తరలించి, అత్యవసర భద్రతా చర్యలు చేపట్టడం భారత ప్రభుత్వం సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచం అంతా మమ్మల్ని ప్రశంసించింది, కానీ దేశం లోపల మాత్రం కొందరు అనవసర విమర్శలతో దిగజారుతున్నారు అని ప్రధాని విమర్శించారు.
పహల్గామ్ దాడికి పాల్పడిన ప్రధాన ఉగ్రవాదులను నిష్పాక్షికంగా మట్టుబెట్టడంలో భారత భద్రతా బలగాలు విజయం సాధించాయి అని కొనియాడారు. ఈ చర్యను “ఆపరేషన్ మహాదేవ్” పేరుతో చేపట్టినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లష్కరే తోయ్బాకు చెందిన సులేమాన్, ఆఫ్గాన్, జిబ్రాన్ అనే ముగ్గురు టాప్ టెరరిస్టులను భారత సైన్యం, జమ్ము కాశ్మీర్ పోలీసులు, జైపీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా హతమార్చారు అన్నారు.
ప్రతిపక్ష నేతలు ఈ ఆపరేషన్‌లను రాజకీయ ప్రయోజనాల కోణంలో చూస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.ఈ దేశ భద్రత ఒకటే పరమావధి, ఇది ఎన్నికల కోసం చేయలేదు అని, ఎవరూ మమ్మల్ని ఆపలేదు. ఎవరూ సూచించలేదు. స్వచ్ఛమైన సంకల్పంతో దేశ ప్రజల కోసం తీసుకున్న చర్యలివి అని మోదీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పహల్గామ్ దాడికి అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పరిపాలనలో రాజకీయ సంకల్పం లోపించిందని ఆరోపించారు. ప్రియాంక గాంధీ గారు అయితే మరింత ఘాటుగా స్పందిస్తూ, మీరు మా తల్లిని ఏడిపించారు, కానీ ప్రజల భద్రత గురించి మాత్రం సమాధానం ఇవ్వలేరా అని ధ్వజమెత్తారు.
భారత రక్షణ వ్యవస్థ నడిపిన ఈ రెండు ఆపరేషన్‌లు దేశ భద్రతపై ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు లభించినప్పటికీ, దేశంలోని కొన్ని పార్టీల విమర్శలు బాధాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇది రాజకీయ అంశం కాదు. దేశాన్ని రక్షించడమే మా ధ్యేయం అని చివర్లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
-
Home
-
Menu