కేటీఆర్ నుండి కౌశిక్ రెడ్డికి ఆత్మీయ అభినందనలు

X
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన అనంతరం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులను కలుసుకున్నారు.
కేటీఆర్ కౌశిక్ రెడ్డిని ఆత్మీయంగా హత్తుకుని భుజం తట్టి అభినందించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, పార్టీలో ప్రతీ ఒక్కరు కౌశిక్ రెడ్డికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి హరీశ్ రావును కలిశారు.
హరీశ్ కూడా అతనిని ఆత్మీయంగా హత్తుకుని ప్రోత్సహించారు. పార్టీకి ఆయన ఇచ్చే సేవలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ హృదయపూర్వక భేటీకి సంబంధించిన వీడియోను కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Next Story
-
Home
-
Menu