స్వేచ్ఛ ఆత్మహత్య కేసు: తెరపైకి పూర్ణచందర్ భార్య స్వప్న

స్వేచ్ఛ ఆత్మహత్య కేసు: తెరపైకి పూర్ణచందర్ భార్య స్వప్న
X
"స్వేచ్ఛే మమ్మల్ని హింసించింది" – పూర్ణచంద్రరావు భార్య సంచలన ఆరోపణ

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు నిత్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న పూర్ణచంద్రరావు భార్య స్వప్న మీడియా ముందుకొచ్చారు. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కేసుకు మరో కోణాన్ని కలిగించాయి.స్వేచ్ఛే మమ్మలను మానసికంగా హింసించేది అని స్వప్న ఆరోపించారు.

తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తానేనని స్వప్న పేర్కొన్నారు. స్వేచ్ఛ తనను, తన భర్తను మానసికంగా వేధించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక, స్వేచ్ఛ తన భర్త పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా భయపెట్టే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.

స్వేచ్ఛ నా భర్త ద్వారా నాకు పరిచయం అయింది అని, మొదట వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు తెలియదు అని,తెలిసిన తర్వాత నేను పూర్ణచందర్‌ను విడిచి పెట్టాను అని పూర్ణచంద్రరావు భార్య వివరించారు.

స్వేచ్ఛ కుమార్తె అరణ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని స్వప్న ఖండించారు. పూర్ణచంద్రరావు అరణ్యను తన సొంత కూతురిలానే చూసుకున్నారు, ఆయనను తప్పుగా చూడొద్దు అని స్వప్న విజ్ఞప్తి చేశారు.

నిందితుడి భార్య స్వయంగా రంగంలోకి దిగి చేసిన ఈ వ్యాఖ్యలు కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముంది. ఇకపోతే, పోలీసులు ఈ ఆరోపణలను ఎంతవరకు పరిశీలిస్తారు? స్వేచ్ఛ మృతికి న్యాయం దక్కుతుందా? అన్నది సమయం చెప్పాలి.

Tags

Next Story