అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన
X
500 పడకల సామర్థ్యంతో, 750 కోట్ల వ్యయంతో నిర్మాణం; కేన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందించనుంది

హైదరాబాద్ లో కేన్సర్ చికిత్స మరియు పరిశోధనలో ప్రముఖంగా నిలిచిన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇప్పుడు అమరావతిలో నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు,ఈ కార్యక్రమంలో సినీ నటుడు,బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ మరియు ఆయన భార్య కూడా పాల్గొన్నారు.

ఈ హాస్పిటల్ తుళ్లూరులో E7 రోడ్డును ఆనుకుని, 21 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో ముందుగా 500 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని,మొత్తం 750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు.ఈ హాస్పిటల్ రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించనుంది. ముఖ్యంగా కేన్సర్ రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయన్నునారు.

శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ, తెలంగాణలోని హైదరాబాద్‌లో బసవతారకం హాస్పిట్యూట్ ఇప్పటికే ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు సేవలు అందిస్తోంది అని, ఇప్పుడు ఇదే అమరావతిలో నిర్మితమవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అన్నారు. కేన్సర్ బాధితులకు ఇది నిజంగా ఒక పెద్ద వరం అవుతుంది అని పేర్కొన్నారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ,ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, అమరావతి వైద్య రంగంలో ఒక ముఖ్య కేంద్రంగా మారుతుంది అని, కేవలం చికిత్సకే కాకుండా, పరిశోధనలోనూ ఇది గొప్ప ఫలితాలను ఇస్తుంది అన్నారు. దేశంలోని వైద్య సేవల నాణ్యత మరియు సౌకర్యాల్లో ఈ హాస్పిటల్ కొత్త ప్రమాణాలను కల్పిస్తుంది అన్నారు నారాయణ.

హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కావడం ద్వారా, కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులు సౌకర్యవంతమైన, ఆధునిక చికిత్సను పొందగలుగుతారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఒక ఆశాకిరణం అవుతుంది.

Tags

Next Story