లిక్కర్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్?

లిక్కర్ స్కాంలో మాజీ ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సీఎంగా పేరుపొందిన నారాయణ స్వామిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక సార్లు విచారణకు హాజరు కావాలని పిలిచినా ఆయన రాలేదని పోలీసులు తెలిపారు. ఆరోగ్యం బాగోలేదంటూ తప్పుడు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారని తెలుస్తోంది.
ఇటీవల సిట్ నుండి నోటీసులు పంపినప్పటికి, నారాయణ స్వామి వాట్సాప్ ద్వారా తన ఆరోగ్యం బాగోలేదని సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. దీంతో నేరుగా పుత్తరుజిల్లాలోని ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు, నారాయణ స్వామి తనకు ఎలాంటి వివరాలు తెలియవు అని, మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అవసరమైనప్పుడు మాత్రమే సంతకాలు చేసేవాడిని అని చెప్పినట్టు ప్రచారం జరిగింది.
సిట్ అధికారులు ఇప్పుడు నారాయణ స్వామిని ఎక్సైజ్ పాలసీ మార్పులు, ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆయన విచారణకు సహకరించకపోవడం వల్ల అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఎప్పుడ సమీక్షలు నిర్వహించారు అనేది మీడియాకు సమాచారం రాలేదు. ఆయన పూర్తిగా తన నియోజకవర్గ పరిమితంగా మాత్రమే పనిచేశారని చెప్పవచ్చు. కల్తీ లిక్కర్ స్కాం సమయంలో కూడా, ఆయన మీడియా ముందుకు రావడం మానేశారు. మీడియా ముందు ఆయన కేవలం తన కుల ఆధారంగా రాజకీయ విమర్శలకు మాత్రమే వ్యవహరించేవారని అభిప్రాయం.
ప్రముఖ రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడైన నారాయణ స్వామి, కేవలం ఒక పదవిలో కూర్చోబెట్టబడ్డారు తప్ప ఆ పదవికి తగిన అధికారాలు ఇవ్వబడలేదు. అయినప్పటికీ, ప్రస్తుతం ఆయనను జైలుకు పంపే పరిస్థితి ఏర్పడింది.
-
Home
-
Menu