పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
X
శుభ్రత లోపం, కిచెన్‌లో ఎలుకలు–ఈగలు, నాన్‌వెజ్‌లో నిషేధిత కలర్స్ ఉపయోగిస్తునట్టు గుర్తింపు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 25 బ్రాంచులను పరిశీలించగా, అందులో 23 చోట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించారు.అధికారులు పరిశీలించినప్పుడు, చాలా చోట్ల వంటగది శుభ్రత లేకుండా ఉండటం గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నట్లు చూసారు. నాన్‌ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు కూడా బయటపడింది.కొన్ని చోట్ల తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లలో నాన్‌ వెజ్ పదార్థాలు నిల్వ చేస్తుండటం అధికారులు గమనించారు. ఈ పరిస్థితులు ఆహార నాణ్యతకు మరియు వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదకరమని అధికారులు తెలిపారు.సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు జరపనున్నారు. ఫలితాల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

Tags

Next Story