ఆంధ్రాని ముంచెత్తుతున్న వరదలు

గుంటూరు, అమరావతి, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఈ రోజు (13 ఆగస్టు 2025) ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తుంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం మొదలయిన సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
అచ్చంపేట-మాదిపాడు రహదారి పై వరద నీరు నిలిచిపోవడం వలన రాకపోకలు ఆగిపోయాయి. అమరావతి-విజయవాడ రూట్లపై రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు కాలచక్ర రోడ్డుపై, సత్తెనపల్లి-అమరావతి మధ్య వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొటేళ్లవాగు ఉద్ధృతిగా పొంగుతుంది, లాం వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల లోతట్టు ప్రాంతాల్లో పొలాలు, నివాస ప్రాంతాల్లో నీరు చేరడం మొదలయింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ప్రకాశం బ్యారేజ్‌కు ఈ ఇప్పటికే 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఇది 5 లక్షల క్యూసెక్కుల వరకూ చేరే అవకాశం ఉన్నందున, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఏ ప్రాంతంలో ప్రజలకు ప్రమాదం కలిగే అవకాశం ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి, తాగునీరు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ సహాయంతో అన్ని శాఖల అధికారులను అలెర్ట్‌గా ఉంచి, వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వమని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వాగులు, చెరువులు పొంగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి, ప్రాణనష్టం జరగకుండా చూడాలి అని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం, అవసరమైన సౌకర్యాలను అందించడం వంటి ముఖ్యమైన తీసుకోవాలి అని హెచ్చరించారు.కొండవీటి వాగు వద్ద ఉన్న మోటర్లను వదిలి, వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేశారు. తద్వారా, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటి రీత్యా పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.
-
Home
-
Menu