సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో నిజాలు

సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో నిజాలు
X
సివిల్ లైన్స్ కార్యాలయంలో ‘జనసున్వాయి’ సమయంలో రాజేష్ దాడి, భద్రతా లోపాలు, వెలుగులోకి మొదట కోర్టులో దాడి యోచన, తర్వాత రేఖా గుప్తా లక్ష్యం

ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి అందరికీ తెలిసిందే, ఆ రోజు ఆమె సివిల్ లైన్స్‌లోని తన కార్యాలయంలో ‘జనసున్వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను వింటున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేప్పట్టారు.విచారణలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

రాజేష్ సక్రియ అనే వ్యక్తి మొదట సుప్రీంకోర్టులోనే దాడి చేయాలని అనుకున్నాడు. కుక్కలపై ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, కోర్టులో ఉన్నవారిపై దాడి చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ అక్కడి కఠినమైన భద్రతను చూసి అతను తన ప్లాన్‌ను వదిలేశాడు. తరువాత అతని దృష్టి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై పడింది.

రాజేష్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కూరగాయల బండి నుంచి కత్తి తీసుకున్నాడు. ఆ కత్తితోనే రేఖా గుప్తాపై దాడి చేయాలనుకున్నాడు. కానీ సివిల్ లైన్స్‌లో ‘జనసున్వాయి’ కార్యక్రమం జరుగుతున్నప్పుడు భద్రతను గమనించి, కత్తిని అక్కడే వదిలేశాడు. దాంతోపాటు, ఆమెను చెంపదెబ్బ కొట్టి, జుట్టు లాగాడు.

రాజేష్‌కి కుక్కలపై చాలా ప్రేమ ఉంది. వీధికుక్కలను తొలగించాలని వచ్చిన తీర్పు, ప్రభుత్వ చర్యలను చూసి అతనికి కోపం వచ్చింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన విజ్ఞప్తిని పట్టించుకోలేదని భావించి ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు.

ఈ ప్రణాళికలో రాజేష్‌కు సహకరించిన తహ్సీన్ సయ్యద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను రాజేష్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, డబ్బుతో సహాయం చేశాడు. అంతేకాకుండా, రేఖా గుప్తా నివాసానికి సంబంధించిన వీడియోలు కూడా రాజేష్ తన మిత్రుడికి పంపినట్లు బయటపడింది. ఈ కేసులో ఉపయోగించిన కత్తి ఇంకా దొరకలేదని పోలీసులు చెప్పారు. దాని కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ముఖ్యమంత్రి భద్రతను మరింత బలపరిచారు. ఇప్పటివరకు ఉన్న భద్రతను పెంచి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. దాదాపు 40 మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో రెండు-స్థాయిల భద్రతా వ్యవస్థ అమలులోకి వచ్చింది.

ఈ సంఘటన తరువాత ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక నిర్ణయం తీసుకొన్నారు ఇకపై ‘జనసున్వాయి’ కార్యక్రమం కేవలం ఆమె నివాసంలోనే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తామని. దీని ద్వారా ప్రజలకు సులభంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు.

Tags

Next Story