భారతదేశం లో మతమార్పుడల రాకెట్‌పై ED ఫోకస్

భారతదేశం లో మతమార్పుడల రాకెట్‌పై ED ఫోకస్
X
మతమార్పిడికి విదేశీ డొనేషన్‌లు: ఛంగూర్ బాబా కేసులో EDకు కీలక ఆధారాలు

మతమార్పిడిపై తీవ్ర విమర్శల పాలైన స్వయంఘోషిత ఆధ్యాత్మిక గురువు ఛంగూర్ బాబాగా ప్రసిద్ధి చెందిన జమాలుద్దీన్ షా వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం ఉదయం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ అనుమానాలతో కూడిన ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ముంబై మరియు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి.

ఎడ్ ఉత్తర్వులు ప్రకారం, మొత్తం 14 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి,అందులో ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ జిల్లాలో 12, ముంబైలో 2 ప్రాంతాలు ఉన్నాయి. లక్నో జోనల్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాలు సుమారు 13 గంటలపాటు కొనసాగినట్లు సమాచారం.

స్వామిజీ ఇంట్లో చెక్కలు, విదేశీ నిధులు, డొనేషన్‌ల పేరుతో ₹100 కోట్లకుపైగా నిధులు అక్రమంగా సమీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిధులను మతమార్పిడికి ప్రోత్సాహంగా ఉపయోగించారని అనుమానం. అలాగే, కొన్ని లావాదేవీలు విదేశీ బ్యాంకులు, NGOల ద్వారా జరిపినట్లు శోధనల్లో వెల్లడైంది.

ED వర్గాల ప్రకారం, ఆర్థిక ముసుగులో ఆధ్యాత్మికత పేరుతో విదేశీ ఫండింగ్‌ను మలుపు తిప్పి భారత్‌లో మతమార్పిడికి ఉపయోగిస్తున్న కుట్రపై ఇది ప్రధాన దర్యాప్తు.

జమాలుద్దీన్ షా అనే వ్యక్తి, "ఛంగూర్ బాబా"గా ప్రసిద్ధి చెందుతూ దేశ వ్యాప్తంగా అనేక మంది అనుచరులను సంపాదించుకున్నాడు. కానీ ఇటీవల కొందరు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, అతను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నాడనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి గత నెలలో కూడా పోలీసులు విచారణ జరిపారు.

Tags

Next Story